
వృద్ధుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్ : నగరంలోని ఇందిరానగర్ లో నివాసముంటున్న పతివాడ కాశయ్య (69) అదృశ్యమైనట్లు బుధవారం విజయనగరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాశయ్య కొడుకు తిలక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్ హెచ్‌సీ అప్పలనాయుడు కేసు నమోదు చేయగా సీఐ ఆర్‌వీకే చౌదరి దర్యాప్తు ప్రారంభించారు.గత నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయిన కాశయ్య ఇప్పటివరకు ఇంటికి తిరిగాలేదని కొడుకు తిలక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కాస్త మతిస్థిమితం లేదని ఇంట్లో గొడవపడి గత నెలలోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. క్రైమ్ పార్టీ కాశయ్య కోసం వెతుకులాట చేపట్టారని సీఐ చౌదరి ఈ సందర్భంగా చెప్పారు