
పాము కాటుతో రైతు మృతి
అయిన వారు వదులుకున్నారు,.108 సిబ్బంది ఆదుకున్నారు
కొత్తవలస: కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించిన వ్యక్తి అవసరం తీరిపోవడంతో అయిన వారు వదులుకున్నారు. అయితే ఆ వ్యక్తిని 108 సిబ్బంది ఆదుకున్నారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడని స్థానికులు 108 వాహనం సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో 108 వాహసం సిబ్బంది టెక్నీషయన్ సీహెచ్.సన్యాసినాయుడు, పైలెట్ విజయ్‌కుమార్‌లు 108 వాహనంలో వచ్చి పరిశీలించగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.అక్కడికి వెళ్లేసరికి సంబంధిత వ్యక్తికి మెలకువ రావడంతో వివరాలు అడగ్గా తాను ఉప్పల వెంకటరావును. కారు డ్రైవర్‌నని తెలిపాడు. భార్య,ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారని, పిల్లలకు పెళ్లిళ్లు జరిపించినట్లు తెలిపాడు. తాను ఆనారోగ్యం పాలుకావడంతో కుటుంబసభ్యులు చిన్నచూపు చూడడంతో అక్కడక్కడ తింటూ రోడ్డుపైనే కాలక్షాపం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన బంధువులకు సమాచారం అందించామని 108 సిబ్బంది తెలిపారు.