
జాతీయలోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
విజయనగరం లీగల్: జాతీయ లోక్ అదాలత్‌ను చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు, జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో ప్రముఖ చిట్‌ఫండ్ కంపెనీల బ్యాంక్ మేనేజర్లు, బ్యాంకులకు సంబంధించిన అధికారులు, కంపెనీ న్యాయవాదులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిట్ కంపెనీలకు, బ్యాంక్‌కు సంబంధించిన కేసులను సెప్టెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న బ్యాంకు దావాలను ఎక్కువ కేసులను రాజీ చేయాలని కంపెనీలకు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యా య సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్, మార్గదర్శి చిట్‌ఫండ్స్, కపిల్ చిట్‌ఫండ్స్ శ్రీరామ్ చిట్‌ఫండ్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.