
జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
పార్వతీపురం రూరల్: ఈనెల 10వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 తేదీ నుంచి 17వ తేదీ వరకు అతివేగం, 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎీస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు డీజీపీ ఉత్తర్వుల మేరకు ఈ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్టేషన్ల పరిధిలో ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రదేశాల వద్ద, బ్లాక్‌స్పాట్‌ల వద్ద రోజూ వాహన తనిఖీలు చేపడుతూ ప్రతి వాహనాన్ని ఆపి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేసి నిర్ధారణ అయితే కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.
ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు చోట్ల వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు పోలీసులు నిర్వహించారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి