
ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు
● డా.డీవీజీ శంకరరావు
పార్వతీపురం రూరల్: ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా తనకు అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి డాక్టర్ డీవీజీ శంకరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కలిసి ముచ్చటించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా అందించిన సేవలపై జగన్‌మోహన్ రెడ్డి తనను అభినందించినట్లు డీవీజీ శంకరరావు తెలిపారు.
సెల్‌టవర్ల ఏర్పాటుకు ఆదేశం
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: జిల్లాలో సెల్‌టవర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జియో, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల ఏర్పాటుపై ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం సమీక్షించారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న టవర్ల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధానమైన రోడ్ల పనులను గుర్తించి నిధులు మంజూరు చేయాలని డ్వామా పీడిని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఎఫ్‌ఓ జీఏపీ ప్రసూన, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయానికి టీడీపీ ఫ్లెక్సీ
జియ్యమ్మవలస రూరల్: కూటమి నేతలు బరితెగించారనేందుకు ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. జియ్యమ్మవలస ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నేతల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని కట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇది ప్రభుత్వ కార్యాలయమా? లేదా టీడీపీ కార్యాలయమా అంటూ వివిధ పనులపై ఎంపీడీఓ కార్యాలయానికి వస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు.
ఏం కష్టమొచ్చిందో ఏమో..?
పార్వతీపురం రూరల్: ఆ కుటుంబానికి ఏం కష్టమొచ్చిందో ఏమో? ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు బెలగాం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై మంగళవారం నిలబడ్డారు. వీరిని గమనించిన రైల్వేపోలీసులు వెంటనే అప్రమత్తమై మందలిస్తూ ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ చేశారు. వారి ఆవేదన విన్నారు. జీవితంలో ప్రతీ ఒక్కరికీ కష్టాలు తప్పవని, వాటిని అధిగమిస్తేనే మంచి జీవితం సొంతమవుతుందని నచ్చజెప్పారు. అనంతరం సివిల్ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు.

ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు

ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు

ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు