
బాబూ.. మేము మోసపోయాం
బాబూ.. నీ మాయ మాటలు నమ్మి మోసపోయాం... సంక్షేమ పథకాలకు దూరమయ్యాం.. ఇక ఎన్నడూ నీ మాటలు నమ్మి మోసపోబోమంటూ జియ్యమ్మవలస మండలం గవరంపేట పంచాయతీ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కోట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో అధికమంది పాల్గొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడం వల్ల ఏ మేరకు నష్టపోయామన్నది తెలియజేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడి్‌డ్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతీ పథకంలోనూ కోతపెడుతూ.. ఇబ్బందులకు గురిచేస్తూ పేదలకు సంక్షేమాన్ని దూరం చేస్తున్నారని వాపోయారు. – జియ్యమ్మవలస రూరల్