
ఆదివాసీ దినోత్సవానికి పక్కాఏర్పాట్లు
సీతంపేట: సీతంపేట, పాతపట్నంలలో ఈ నెల 9న నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఉత్సవాలకు వచ్చే గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భోజన ఏర్పాట్లు బాగుండాలన్నారు.
కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, సీఐ చంద్రమౌళి, డీడీ అన్నదొర, ఎస్‌ఐ అమ్మన్నరావు, పీహెచ్‌ఓ గణేష్, ఐటీడీఏ పరిపాలనాధికారి సునీల్, డిప్యూటీ ఈఓ రామ్మోహనరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయపార్వతి, ఏఎంఓ కోటిబాబు, తదితరులు పాల్గొన్నారు.