
స్పందించిన అధికారులు
జియ్యమ్మవలస రూరల్: ఈ నెల 5న కొండసిరిపి పాఠశాల ఉపాధ్యాయురాలు విధులకు గైర్హాజరు కావడంపై విచారణ జరుపుతామని గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఆర్.కృష్ణవేణి తెలిపారు. ‘మా టీచర్ బడికి రాలేదు’ శీర్షికకు మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు జియ్యమ్మవలస ఎంఈఓ, ఆర్‌ఆర్బీపురం స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం కొండసిరిపి పాఠశాలను సందర్శించారు. కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో హుటాహుటిన సెలవుపై వెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా వెళ్లినందుకు ఆమెకు మెమో జారీచేసి సంజాయిషీ కోరగా, ఇకపై ఇటువంటివి పునరావృతం కావని ఆమె తెలియజేసినట్టు వివరించారు.

స్పందించిన అధికారులు