
మా టీచర్ రాలేదు..
చిత్రంలో పాఠశాల గేటు ఎక్కి ప్రమాదకర స్థితిలో ఆడుకుంటున్నది జియ్యమ్మవలస మండలం కొండసిరిపి జీపీఎస్ విద్యార్థులు. పాఠశాల సమయంలో అడుకుంటున్నారేమిటని చిన్నారులను ప్రశ్నిస్తే టీచర్ రాలేదంటూ సమాధానమిచ్చారు. సీఆర్‌టీ సోమవారం పాఠశాలకు రాకపోవడంతో చిన్నారులు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఆడుకుంటూ ఇంటిబాట పట్టారు. వాస్తవంగా సీఆర్‌టీ సెలవు పెడితే ఎంఈఓ మరొక టీచర్‌ను పాఠశాలకు పంపించాలి. ఇక్కడ ఆ నిబంధన అమలు కావడం లేదు. టీచర్ సెలవుపెట్టినప్పుడు తరగతులు సాగడంలేదని, ఎప్పడు తరగతులు ఉంటాయో లేదో తెలియడంలేదని, చిన్నారుకు బోధన సాగడంలేదని గ్రామస్తులు తెలిపారు. – జియ్యమ్మవలస రూరల్