
దళారులకే ఎరువులు
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● రైతాంగానికి యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం ● ఎరువుల కృత్రిమ కొరతపై చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే జోగారావు ● పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతి
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లాలో నిజమైన రైతుకు యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందడం లేదని.. కూటమి నాయకులు, కార్యకర్తలే దళారుల అవతారం ఎత్తి వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరకు విక్రయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. ఎరువులు అందక, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలు వెచ్చించి కొనుగోలు చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొరతను నివారించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఎరువుల సమస్య పరిష్కరించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీఆధ్వర్యంలో నాయకులు సోమవారం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్వో హేమలత కు వినతిపత్రం అందజేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచ ర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి, కురు పాం నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల పుష్పశ్రీవా ణి, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి అలజంగి జోగారావు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
లారీ ఢీకొనడంతో మృతి చెందిన కొరిశీల యువకులు
● బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
● గాలిలో కలిసిన ముగ్గురు యువకుల ప్రాణాలు
● కొరిశీల గ్రామంలో విషాదం
● మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
● కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు
న్యూస్‌రీల్
రైతులను దగా చేస్తున్న
కూటమి ప్రభుత్వం
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతన్నలకు పార్టీ రంగు అంటగట్టి, అరకొర ఎరువులను అందించి కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైతులు ఎదుర్కొంటున్నారు. చివరికి ఎరువులను కూడా కూటమి ప్రభుత్వం వారు వదలడం లేదు. వారి నిర్వాకం వల్లే కృత్రిమ కొరత. పార్టీ జెండాలు, పార్టీ రంగులు చూసి ఇవ్వడం దురదృష్టకరం. కూటమి సిగ్గుమాలిన పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుంది? ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి. దళారీ వ్యవస్థను అరికట్టి, రైతులకు అవసరమైన ఎరువులను అందించాలి.
– అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే,
పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి

దళారులకే ఎరువులు

దళారులకే ఎరువులు