
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల ప్రజలతో సీతంపేట అడ్వంచర్ పార్కు లో ఉదయం 10 గంటలకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మండలాలకు పాతపట్నం మార్కె ట్ యార్డు ఆవరణలో అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తా మని పేర్కొన్నారు.
సాగునీటి కోసం
రైతుల ఆందోళన
పాలకొండ: ఖరీఫ్ సీజన్‌లో వరి ఉభాలు ఆరభమైనా తోటపల్లి ఎడమ కాలువ నుంచి ఆయకట్టుకు సాగునీరు అందడంలేదంటూ రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. జలవనరు ల శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు, రైతులు కండాపు ప్రసా దరావు, వారాడ సుమంత్‌నాయుడు మాట్లాడు తూ ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇంతవరకు సాగునీరు అందకపోయినా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. జూన్ 4వ తేదీన రైతులతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి షట్టర్లు బాగుచేస్తామ ని హమీ ఇచ్చి ఇంతవరకు చేపట్టలేదని వాపోయారు. వర్షాభావంతో వరి నాట్లు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీరు అందించకుంటే క్రాప్ హలీడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి రైతుల కు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు జలవనరుల శాఖ అధికా రులకు వినతి పత్రం అందజేశారు. దీనిపై డీఈఈ స్పందిస్తూ రెండు రోజుల్లో పాలకొండ లోని భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దావాల రమణారావు, ఆయకట్టు రైతులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
ఎరువుల కోసం నిరసన
సాలూరు: ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన పంటలకు వేసేందుకు యూరియా దొరకడం లేదు.. బయట మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.. ఎరువును ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలంటూ కురుకుట్టి రైతుభరోసా కేంద్రం వద్ద సోమవారం గిరిజన రైతులు పెద్ద ఎత్తన ఆందోళన చేశారు. కురుకుట్టి పంచాయతీ పరిధిలోని పుల్లమామిడి, బట్టివలస, దళాయివల స, పుల్లేలవలస, తాడ్డివలస, నందేడవలస తదితర 18 గ్రామాల నుంచి సుమారు 400 మంది ఆందోళనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోయారు. ఎరువు లు అందించలేని ప్రభుత్వ నిస్సహాయతను ఎండగట్టారు. తక్షణమే ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
12న డీవార్మింగ్ డే
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈనెల 12న నిర్వహించనున్న డీ వార్మింగ్ డేను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆల్బెండోజోల్ మాత్రలను పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కరరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 1,96,612 మంది బాలబాలికలకు ఆల్బెండజో ల్ మాత్రలు అందజేస్తామన్నారు. వీటిని భోజ నం అనంతరం మాత్రమే మింగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సేవల ధరల పట్టిక పెట్టాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులందరూ విధిగా వివిధ సేవల ధరల పట్టికను పెట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి ఆదేశించారు. ప్రతీ ఆస్పత్రికి ఫైర్ ఎన్‌ఓసీ తప్పనిసరన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం