
దూసుకొచ్చిన మృత్యువు
కొమరాడ: ఓ ఐదు నిమిషాల్లో వారి ప్రయాణం సుఖవంతమయ్యేది. ఇంతలో లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వెనుక నుంచి వారు వెళ్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. అంతే.. ముగ్గురు యువకుల ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొమరాడ మండలం గుణదతీలేస్ పంచాయతీ కొరిశీల గ్రామానికి చెందిన సిగురు కార్తీక్ (21), సిగురు ఉదయ్ కిరణ్ (19 ) అన్నదమ్ములు. వీరి తల్లి మృతిచెందింది. తండ్రి పురుపాలు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా ఒడిశాకు వలసవెళ్లి పనిచేస్తున్నాడు. కార్తీక్ ఐటీఐ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడిని చూసేందుకు ఇటీవల గ్రామానికి వచ్చాడు. చక్కగా చదువుకోవాలంటూ డిగ్రీ చదువుతున్న ఉదయ్‌కిరణ్‌కు హితబోధ చేశాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో గుమ్మ రైల్వేస్టేషన్‌కు తమ్ముడితో పాటు ఇంట ర్ చదువుతున్న గ్రామానికి చెందిన దువ్వాన జగన్ (17)తో కలిసి సోమవారం సాయంత్రం బయలుదేరాడు. మరో ఐదు నిమిషాల్లో స్టేషన్‌కు చేరుకుంటారన్న సమయంలో కేజీబీవీ సమీపంలోని ములుపు వద్ద ఒడిశాకు చెందిన లారీ వెను కనుంచి ఢీకొంది. అంతే.. చెల్లాచెదురుగా పడిపోయారు. వారి కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. రోడ్డంతా రక్తంతో తడిసిపోయింది. వివిధ అవయవాలు నుజ్జయ్యాయి. ఈ ఘటనను చూసి న వారు కన్నీరుపెట్టారు. అయ్యో.. చిన్నవయస్సులోనే మృత్యువు కాటేసిందంటూ రోదించారు. కుటుంబాలను ఆదుకుంటారనుకున్న యువకుల ప్రయాణం అర్ధాంతరంగా ముగి యడంతో గ్రామంలో విషాదం అలముకుంది.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు