
తరలించుకుపోతున్నారు..
● కూటమి నేతలు దౌర్జన్యంగా
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించాం. రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వమే.. నేడు వారిని ఇబ్బంది పెడుతోంది. వ్యవసాయ పనుల కీలక సమయంలో యూరియా, డీఏపీ ఎరువును జిల్లా యంత్రాంగం అందించలేకపోయింది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని పెద్దూరు సచివాలయం పరిధిలో 3 వేలు ఎకరాలు ఉంటే.. కేవలం 450 బస్తాలే ఇచ్చారు. ఇది సరిపోతుందా? ఏ పంచాయతీకి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం అందించకపోవడం వల్ల నల్లబజారులో రూ.550 నుంచి రూ.600 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొరత లేదని జిల్లా కలెక్టర్ ఏ విధంగా ప్రకటన ఇస్తారు? రైతుకు భరోసా ఇవ్వడమంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు, పచ్చరొట్ట విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు సబ్సిడీపై గతం ప్రభుత్వంలో అందించడం. నేడు ఏమిచ్చారు? సచివాలయానికి 200 బస్తాలిస్తే.. కూటమి నేతలు ట్రాక్టర్లు తెచ్చి, 50 బస్తాల వరకు దౌర్జన్యంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది.
– పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి, కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి