
● ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం
ఆకుమడుల సమయంలో యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతుకు ఎరువులు, విత్తనాలు కూడా అందించలేని స్థితిలో యంత్రాంగం ఉంది. దళారులు కృత్రిమ కొరత సృష్టించారు. నల్లబజారుకు తరలించారు. రైతుకు గత్యంతరం లేక అధిక ధరకు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. యూరియా అంతా ఇచ్చేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని ఒకసారి పరిశీలించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. రైతులందరికీ ఆయన ద్వారా భరోసా ఉండదని స్వయంగా ఒప్పుకున్నారు. అది నిజం చేస్తున్నారు. ఆయన దారిలోనే అధికారులు కూడా వెళ్తున్నట్లు ఉంది. నేడు దారుణమైన పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఎరువులు, యూరియా కొరత నివారించి, వారిని ఆదుకోవాలి.
– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు