గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Aug 4 2025 3:49 AM | Updated on Aug 4 2025 3:49 AM

గుర్త

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వేపాడ:

వేపాడ–ఆనందపురం ప్రధాన రహదారిలో నీలకంఠరాజపురం వద్ద రైవాడ కాలువ కల్వర్టు సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నీలకంఠరాజపురం రైవాడ కాలువ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. వ్యక్తిని ఢీకొన్న వాహనం, ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని వల్లంపూడి ఎస్సై సుదర్శన్‌, సీఐ అప్పలనాయుడు సిబ్బంది సందర్శించి ప్రమాదంపై గ్రామస్తులను ఆరాతీశారు. తెల్లవారుజామున 2గంటల నుంచి 4 గంటల మధ్య ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన స్కూటీ కల్వర్టుగోడ పక్కన ఉందన్నారు. మృతదేహాన్ని ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించామని కుటుంబసభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు.

బైక్‌తో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి..

రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి, జన్నివలస జంక్షన్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచ్రవాహనంతో విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జన్నివలస పంచాయతీ పరిధిలోని నేరళ్లవలస గిరిజన గ్రామానికి చెందిన కుడుమూరు కన్నయ్య దొర (26) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై రామభద్రపురం మండలకేంద్రానికి వచ్చాడు. పని ముగించుకుని తిరిగి సొంత గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొని అక్కడిక్కడే మృతిచెందాడు.ఆదివారం ఉదయం అటువైపు వాకింగ్‌కు వెళ్తున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితిని పరిశీలించారు.

మృతుడికి భార్య భవాని, పిల్లలు అజిత్‌ కుమార్‌, సోను ఉన్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న ఇంటి పెద్ద దిక్కు ను కోల్పోవడంతో తల్లి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించి మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలియరాని మృతుడి వివరాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి1
1/3

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి2
2/3

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి3
3/3

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement