
జాతీయ రహదారిపై లారీ బీభత్సం
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి ఒడిశా వెళ్తున్న ఓ లారీని ఆరికతోట వద్ద డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి టిఫిన్‌కు వెళ్లాడు. లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయో ఏమో గానీ సడన్‌గా లారీ ముందుకు వెళ్లి ఎదురుగా ఆగి ఉన్న 3 బైకులు, రెండు ఆటోలు, ఒక బొలెరో వ్యాన్‌ను ఢీ కొట్టుకుంటూ దూసుకెళ్లి రహదారి పక్కన ఉన్న ఓ ఆటోను ఢీ కొట్టి ఆగింది. ముందుగా మొక్కజొన్న కంకుల లోడు కోసం ఆగి ఉన్న బొలెరో వ్యాన్‌ను ఢీ కొనడంతో ఆ వ్యాన్ పక్కన ఉన్న గోతిలో పడింది. అలాగా టిఫిన్ కొట్టు ముందు ఆగి ఉన్న ఆటోను ఒక్క సారిగా ఢీ కొనడంతో ఆ ఆటో టిఫిన్ కొట్టులోకి వెళ్లి దుకాణంలో ఉన్న సామగ్రి ధ్వంసం చేసింది. తర్వాత మరికొంత దూరంలో ఉన్న మూడు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టడంతో ఒక బైక్ నుజ్జు నుజ్జవగా మరో రెండు బైక్‌లు లారీ కింద చక్రాల మధ్య ఇరుక్కుపోయి పూర్తిగి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని ఆరికతోట యజ్జల భాస్కరరావుకు చెందిన ఆటోతో పాటు టీ దుకాణంలో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే ఇదే దుప్పలపూడి గ్రామానికి చెందిన చిప్పాడ రవితో పాటు మరో ఇద్దరి ద్విచక్రవాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఈ రోడ్డు ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం, ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ బీభత్సంపై బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
3 బైకులు, రెండు ఆటోలు, ఒక బొలెరో వ్యాన్ ధ్వంసం
ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు

జాతీయ రహదారిపై లారీ బీభత్సం

జాతీయ రహదారిపై లారీ బీభత్సం

జాతీయ రహదారిపై లారీ బీభత్సం

జాతీయ రహదారిపై లారీ బీభత్సం