
ఆదివాిసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
–8లో
డిజిటల్ బోర్డుల పేరిట దోపిడీ
ప్రతి ఇంటికి డిజిటల్ ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు.
పార్వతీపురంటౌన్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఆయన చాంబర్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గిరిజన లబ్ధిదారులకు భూపట్టాలు, గృహ పట్టాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర ఉపకారణాలు, ఆర్థిక లబ్ధిని చేకూర్చే చెక్కుల పంపిణీ ఉండేలా చర్యలు తీసుకోవాల న్నారు. సాంస్కృతిక, ఆర్చరీ పోటీలను నిర్వహించాలని సూచించారు. సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేయాలని, గిరిజనాభివద్ధి కోసం ఆది కర్మయోగి కార్యక్రమం అమలుకానుందని, చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని అమలుచేయాలని అధికారులను పీఓ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు కె.రామచంద్ర రావు, ఎం.సుధారాణి, ఐటీడీఏ ఏపీఓ ఎ.మురళీధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ