
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనారోగ్యం
పార్వతీపురం రూరల్: మండలంలోని డోకిశీలలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 25మంది జ్వరం, తలనొప్పి, వాంతులతో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఐశ్వర్య విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు.
గురువారం ఒక్కసారిగా ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆశ్రమ పాఠశాలలో మంచాలకే పరిమితమయ్యారు. అయితే విద్యార్థుల పట్ల అధికారులు కానీ, ఆరోగ్య సిబ్బంది కానీ ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మెరుగైన వైద్యం విద్యార్థులకు అందించాలని విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనారోగ్యం