
మూలబిన్నిడిలో సీతాఫలం సంత
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్ ఆరంభమైంది. కొండల్లో సేకరించిన సీతాఫలా లను గిరిజన రైతులు సంతలు, మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయి బిన్నిడి పంచాయతీ మూల బిన్నిడి లో బుధవారం నిర్వహించిన సంతకు గిరిజనులు పెద్ద ఎత్తున సీతాఫలాలు తెచ్చారు. చినమేరంగి, కురుపాం, పార్వతీపురం ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి వాటిని కొనుగోలు చేశారు. 100 సీతాఫలం పండ్లను రూ.300, రూ.400లకు సైజును బట్టి కొనుగోలు చేశారు. ఏజెన్సీ ప్రాంత సీతాఫలాలకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు.