
వరినారు చివర్లు తుంచి నాటుకోవాలి
మక్కువ: వరి నాట్లు వేసేటప్పుడు నారు చివర్లు తుంచి వేయాలని వ్యవసాయాధికారి చింతల భారతి రైతులకు సూచించారు. ఈ మేరకు మండలకేంద్రం మక్కువ, దబ్బగెడ్డ గ్రామాల్లో మండల వ్యవసాయఅధికారి చింతల భారతి ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులతో నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ ఈ విధంగా నాట్లు వేసుకుంటే కాండం తొలిచే పురుగు నివారించవచ్చునని తెలిపారు. అలాగే వరిపొలాల్లో కాలిబాటలు తీసుకోవాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపీ ద్రవరూపంలో ఉన్నందున, పంటలకు త్వరగా అవసరమైన పోషకాలను అందిస్తాయన్నారు. ఆధునిక ఎరువులు పంటల పెరుగుదలను, దిగుబడిని పెంచడంలో సహాయపడతాయన్నారు. అలాగే సాధారణ ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు ఎం.హేమంత్, రైతులు పాల్గొన్నారు.