
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామం సమీపంలో కిత్తన్నపేట గ్రామానికి వెళ్లే దారిని ఆనుకుని ఉన్న తుప్పల్లో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించారు. ఈ సమాచారం అందడంతో ఎస్సై నవీన్‌పడాల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని చంపి మూడు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో పడేశారని స్థానికులు చెప్పుకుంటున్నారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. గళ్ల లుంగీ, లైట్ నీలంరంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. స్థానికులు, చుట్టు పక్కల గ్రామస్తులను విచారణ చేయగా ఈ వ్యక్తి ఈ ప్రాంతం వాడు కాదని తెలిపారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లగేజీ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
చీపురుపల్లి: పట్టణంలోని శ్రీకనకమహాలక్ష్మి ఆలయ సమీపంలో చిన్న చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో పుర్రేయవలస గ్రామానికి చెందిన కుప్పిలి శ్రీనివాసరావు(37) సంఘటన స్థలంలోనే మృతిచెందగా మరో వ్యక్తి కుప్పిలి నీలబాబుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి మృతుని భార్య మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దామోదరరావు తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు పుర్రేయవలస గ్రామానికి చెందిన కుప్పిలి శ్రీనివాసరావు, కుప్పిలి నీలబాబు మధ్యాహ్నం 1:40గంటల సమయంలో పల్సర్ బైక్‌పై చీపురుపల్లి నుంచి పుర్రేయవలస వెళ్తున్నారు. అదే సమయంలో లావేరు నుంచి చీపురుపల్లి వస్తున్న లగేజ్ వ్యాన్ వారి బైక్‌ను డీకొట్టింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా నీలబాబుకు గాయాలయ్యాయి.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం