
హ స్తకళల ఉత్పత్తులకు విశేషస్పందన
విజయనగరం అర్బన్: చేనేత వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేందుకు స్థానిక లయన్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనల(ఎగ్జిబిషన్)కు విశేష స్పందన లభించింది. వివిధ రాష్ట్రాల నుంచి నేరుగా చేనేత వస్త్రాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ పరకు ప్రదర్శన కొనసాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన హస్తకళలను ప్రోత్సహించాలని కోరారు.
ఎగ్జిబిషన్‌లో పలు రాష్ట్రాల ఉత్పత్తులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల తయారీదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రదర్శనలో విక్రయిస్తున్నారు. స్వయం ఉపాధి కార్మికులు స్వయంగా తయారు చేసిన హస్తకళలను ప్రోత్సహించాలని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు.
కొనుగోలుకు జనం ఆసక్తి
విజయనగరంలో 20వ తేదీ వరకు
హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్

హ స్తకళల ఉత్పత్తులకు విశేషస్పందన