
హామీలిస్తే సరి.. తోడ్పాటు ఎప్పుడో మరి!
● అధికారుల చుట్టూ తిరుగుతున్న ఆదర్శ రైతు బాబూరావు ● తక్కువ మదుపుతోనే వినూత్న యంత్రాలు తయారీ ● జిల్లా యంత్రాంగం నుంచి కొరవడుతున్న సహకారం
సాక్షి, పార్వతీపురం మన్యం:
మెకానిక్‌గా పని చేస్తూ, వ్యవసాయం చేసుకుంటూ, రైతులకు తక్కువ పెట్టుబడితో యంత్ర పరికరాలను తయారు చేస్తున్న దమరశింగి బాబూరావు కు జిల్లా యంత్రాంగం నుంచి సహకారం కొరవడుతోంది. బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందు కు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న డ్రమ్‌సీడర్‌ను బాబూరావు రూపొందించా రు. దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ కూడా మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళన్‌లోనూ ఆయన యంత్ర పరికరాలను ప్రదర్శించి, అందరి మన్ననలూ పొందారు. పతకాలు కూడా పొందాడు. ఈయన చదివింది పదో తరగతే అయినా.. ప్రతిభను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందజేసింది. దీంతో పాటు.. మరిన్ని పరికరాలను తయారు చేయించాలనే ఉద్దేశంతో గత కలెక్టర్ హయాంలో బాబూరావు పేరిట ఇన్‌కార్పొరేషన్ కంపెనీ డీబీఆర్ అగ్రిమార్ట్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను రిజిస్ట్రేషన్ చేయించారు. కంపెనీ నెలకొల్పేందుకు గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద ఎకరా స్థ లం కూడా మంజూరు చేశారు. దానికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు రాలేదు. అప్పటి నుంచి అధికారు ల చుట్టూ బాబూరావు తిరుగుతూనే ఉన్నాడు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశా డు. కంపెనీ పెట్టి, నూతన వ్యవసాయ పరికరాల తో రైతులకు సహకారం అందిస్తానని, మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెబుతున్నా.. అధికారులు తనను ఎందుకు ప్రోత్సహించ డం లేదో అర్థం కావడం లేదని బాబూరావు వాపోతున్నాడు.

హామీలిస్తే సరి.. తోడ్పాటు ఎప్పుడో మరి!