
● మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ●
ఏపీలో మహిళలకు రక్షణ కరువు
వీరఘట్టం: కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నా రు. వీరఘట్టం మండలం వండువ గ్రామంలో ఆమె మీడియాతో శుక్రవారం మాట్లాడారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే ఎమ్మెల్యే భానుప్రకాష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా జెట్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను అసభ్యకరంగా దూషిస్తూ సభ్యసమాజం తలదించుకునేలా కూటమి నాయకులు వ్యవహరించారన్నారు. నేడు మాజీ మంత్రి రోజాపై నిసిగ్గుగా నోరుపారేసుకుంటున్న పచ్చ మూకలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నాయ కులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి దారుణమైన పాలన ఏనాడూ చూడలేదని, కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది పాలన గడిపేశారన్నారు. కూటమి నాయకుల అరాచకాలు, అక్రమాలకు బలైపోతున్న వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలు నేరవేర్చాంటూ ఇంటింటికీ వచ్చి చెబుతున్న కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలని కోరారు.
మర్యాదపూర్వక కలయిక
సాలూరు: వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను సాలూరులోని ఆయన నివాసంలో సినీ నటు డు, దర్శకుడు, నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి శుక్రవారం కలిశారు. ఆయన ను రాజన్నదొర సాదరంగా ఆహ్వానించారు. పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, కురుకుటి ఎంపీటీసీ సభ్యుడు గెమ్మెల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
సాహస బాలుడికి అభినందనలు
పాలకొండ రూరల్: పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి పొగిరి నాని సమయస్ఫూర్తి, సాహసం ఎంతో గొప్పవ ని హెచ్‌ఎం దాసరి నాగభూషణరావు అన్నా రు. నాని స్వగ్రామం అంపిలి. గ్రామానికి ఆను కుని నాగావళి నది ప్రవహిస్తుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. ఇది గమనించక ఎన్.కె.రాజపురానికి చెందిన ముగ్గురు పిల్లలు నదిలో సరదాగా ఈతకు దిగారు. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతుండడాన్ని గమనించిన నాని.. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంతో నదిలో దూకి ముగ్గురు పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు హెచ్‌ఎం తెలిపారు. తండ్రి తవిటినాయుడు ప్రోత్సాహంతో నదిలో ఈతలో మెలకువలు నేర్చుకున్న నాని చేసిన సాహసాన్ని సహవిద్యార్థుల ముందు శుక్రవారం కొనియాడారు. జ్ఞాపికను, సాహస స్ఫూర్తి గాదలతో కూడిన పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సహ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

● మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ●

● మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ●