
పశువుల వాహనం సీజ్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని వెంకంపేట జంక్షన్ వద్ద అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాన్ని పశు సంవర్థక శాఖ అధికారు లు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. బొబ్బిలి నుంచి కాకినాడ జిల్లాలోని ఓ ప్రాంతానికి అనుమతి తీసుకుని పార్వతీపురం మీదుగా పశువుల తరలించడా న్ని ప్రశ్నించారు. వాహనాన్ని పార్వతీపురం పట్టణ పోలీసులకు అప్పగించారు. పట్టణ ఎస్సై గోవింద వాహనాన్ని అదుపులోకి తీసుకు ని అందులో ఉన్న 32 గేదెలను పట్టణ శివారు లో ఉన్న మార్కెట్ యార్డుకు తరలించారు. వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.