
యాౖభై ఏళ్ల వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: భార్య అన్నం సరిగా వండలేదని అలిగిన ఓ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఇందుకు సంబంధించి ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం మండలం కొండకరకాం గ్రామానికి చెందిన యజ్జపురపు గౌరినాయుడి(50)కు భార్య సత్యవతితో ఒక పాప ఉంది. ఇన్నాళ్లూ అన్యోన్యంగా సాగిన భార్యాభర్తల కాపురంలో ‘అన్నం’ చిచ్చుపెట్టింది. తనకు సరిగా అన్నం వండి పెట్టలేదన్న కోపంతో భర్త గౌరినాయుడు అలిగాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గలాటా జరిగింది. దీంతో ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయి నేటివరకు ఇంటికి చేరకపోవడంతో భార్య సత్యవతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో లేదని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.