
కలెక్టరేట్‌నా.. సచివాలయమా!
ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లడానికై నా ఇన్ని ఆంక్షలు ఉంటాయో, ఉండవో గానీ... పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌కు మాత్రం అడుగడుగునా ఆంక్షలే.
కలెక్టరేట్‌లోపలికి ఇతరులెవరూ ప్రవేశించకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. వివిధ సమస్యలపై వచ్చే నిరసనకారులను గేటు వద్దే పోలీసులతో అడ్డుకుంటున్న విషయం విదితమే. వినతులిచ్చేందుకు వచ్చే ప్రజలను సైతం గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ‘చేయి ఎత్తొద్దు..
గొంతు విప్పొద్దు’ నిబంధనలను కఠినంగా అమలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన గేటు దాటి.. లోపలికి వచ్చే మార్గంలో బారికేడ్లు పెట్టేశారు. అధికారుల వాహనాలను మినహాయించి, ఇతరుల వాహనాలేవీ రాకుండా అడ్డుకుంటున్నారు. దీని కోసం ఒక ఉద్యోగిని కాపలాగా ఉంచారు. ప్రజా విజ్ఞప్తులను గాలికొదిలేసి, ఇటువంటి పనులపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించడాన్ని ప్రజాసంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం

కలెక్టరేట్‌నా.. సచివాలయమా!