
230 కిలోల గంజాయి సీజ్
విజయనగరం క్రైమ్: ఒడిశా రాష్ట్రం పొట్టంగి నుంచి విశాఖకు రెండు కార్లలో తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా మని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. పెదమానాపురం పోలీ సులు, ఈగల్ బృందానికి వచ్చిన కచ్చితమైన సమాచారంతో జిల్లాలోని దత్తిరాజేరు మండ లం మానాపురం రైల్వే గేట్ సమీపంలో ఈ నెల 13న వాహన తనిఖీలు చేపట్టారు. రెండు కార్లలో 230 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను చూసి కార్లు విడిచిపెట్టి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం పదం పంచాయతీ జంగరాదకి చెందిన ఘాసిరాం హంతల్ (24), కొరాపుట్ జిల్లా సిమిలిగూడ మండలం దబాయిగూడ పంచా యతీ ఝలియగూడకి చెందిన కరన్ ఖిలో (24)లు పట్టుబడ్డారు. సురేష్, అదకాబీయా ఖనిలతి, జున్నేష్ పరారయ్యారు. నిందితుల నుంచి 44 ప్యాకెట్లులో ఉన్న గంజాయితీతో పాటు రూ.700ల నగదు, మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పరారైన మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి, గజపతినగరం సీఐ జీఏవీ రమణ, మానాపురం ఎస్సై ఆర్.జయంతి, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. కానిస్టేబుల్స్ కె.అప్పన్న, కె.శంకర్, హెచ్‌సీ కె.అప్పలస్వామిలను ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.
పార్కింగ్ ఫీజు పెంపుపై ఆందోళన
విజయనగరం టౌన్: విజయనగరం రైల్వేస్టేషన్‌లో వాహనాలు పార్కింగ్ చేసేవారినుంచి ప్రైవేటు పార్కింగ్ వ్యవస్థ నిలువు దోపిడీకి రంగం సిద్ధం చేసింది. ఒకేసారి నెలకు రూ.300 ఉన్న పార్కింగ్ ఫీజును మూడురెట్లు పెంచి రూ.900 చేయడంతో చిరుద్యోగులు, దినసరి కూలీలు భగ్గుమన్నారు. పార్కింగ్ ఫీజుల దోపిడీపై సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. విజయనగరం నుంచి విశాఖ పట్టణం వెళ్లేందుకు రైల్వే మంత్లీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) రూ.250 ఉంటే, వాహనం పార్కింగ్ ఫీజు రూ.900లకు పెంచడమేమిటంటూ పార్కింగ్ సిబ్బందిని నిలదీశారు. రోజుకు బైక్‌కు రూ.10లు ఉన్న ఫీజును రూ.40కి ఎలా పెంచుతారని నిలదీశారు. దీనిపై డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. ఫీజులు తగ్గించుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
● ఇద్దరు నిందితుల అరెస్టు
● పరారీలో మరోముగ్గురు ..
● ఒడిశా నుంచి విశాఖకు రెండు కార్లలో గంజాయి అక్రమ రవాణా
● వివరాలు వెల్లడించిన ఎస్పీ
వకుల్‌జిందల్

230 కిలోల గంజాయి సీజ్