
కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం
● ఇంటింటికీ క్యూఆర్ కోడ్‌తో వివరిద్దాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు
పార్వతీపురంటౌన్: సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది కాలంగా చేసిన మెసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం పట్టణంలోని లయన్స్‌క్లబ్ ఫంక్షన్ హాల్ ఆవరణలో బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీపై పురపాలక, మండల స్ధాయి వైఎస్సార్‌సీపీ నాయకులతో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం శత్రుచర్ల పరీక్షిత్ రాజు మాట్లాడుతూ హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నా రన్నారు. సూపర్‌సిక్స్ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన తీరును ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ క్యాడర్ వెళ్లి వివరించాలని కోరారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాలవారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుదని వివరించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడరని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ మండల అధ్యక్షులు బొమ్మి రమేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్‌లు కొండపల్లి రుక్ష్మిణి, యిండుపూరు గున్నేశ్వర రావు, జెడ్పీటీసీ బలగరేవతమ్మ, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీలు సిద్దా జగన్నాథం, బంకురు రవికుమార్, రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్మదర్శి దేవుపల్లి నాగరాజు, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి బి.వాసుదేవరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి పోల సత్యనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షులు గొర్లి మాధవరావు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు సుధ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్‌లు, పార్టీ ప్రతినిధులు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, వార్డు ఇన్‌చార్జిలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ
వైఫల్యాలను ఎండగడదాం
సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలను బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ప్రజల్లోకి తీసుకువెళ్దాం. కూటమి ప్రభుత్వ పాలన, చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రజల గొంతుకగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ముందుకు సాగుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం. సీఎం చంద్రబాబు హామీలన్నీ అమలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం కూటమి నేతలు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. గ్రామ, మండల స్థాయిలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త భాధ్యతగా తీసుకోవాలి.
–అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే పార్వతీపురం
కూటమి నేతల పనితీరు శూన్యం
ఎన్నికల ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేపట్టారు. తీరా అధికారం చేపట్టిన తరువాత వారి పనితీరు శూన్యంగా ఉంది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమానికి వెళ్తున్న కూటమి నాయకులను ప్రజలు చీదరించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహిళలు, యువత, రైతులు, విద్యార్ధులు, నిరుగ్యోగులు అన్నివర్గాలవారిని మోసం చేస్తూ పస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రతి కార్యకర్త, నాయకులు వివరించాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ గుమ్మ తనూజారాణి, ఎంపీ అరకు
మోసపూరిత హామీలను వివరిద్దాం
చంద్రబాబు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన వాటిని విస్మరించారు. ఆ మోసపూరిత హామీలను ఎండగడదాం. హామీలు అమలు చేసేంత వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రైతులకు సాయం ఇప్పటి వరకు లేదు. నిరుద్యోగ యువతీ, యువకులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి స్తామన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఇవ్వడం లేదు. బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని 5 వారాలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తాం. – మామిడి శ్రీకాంత్,
తూర్పుకావు కార్పొరేషన్ మాజీ చైర్మన్

కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం

కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం

కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం

కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం