సీతంపేట: రాంగ్‌రూట్‌లో వ చ్చిన ఒక కారు వైఎస్సార్‌సీపీ నాయకుడు సవర తవిటిరా జు (48) ప్రాణాలు బలిగొంది. సీతంపేట మండలంలోని చీడి మానుగూడకు చెందిన హడ్డుబంగి ఎంపీటీసీ ఎస్.సరోజిని భర్త తవిటిరాజు తన ద్విచక్రవాహనంపై సీతంపేట వస్తుండగా ఎదురుగా పాలకొండ నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న కారు కంబగూడ గ్రామ మలుపువద్ద రాంగ్‌రూట్‌లో వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో తవిటిరాజు కాలువిరిగి, తలకు బలమైన గాయం తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య సరోజిని, ఇద్దరు కుమార్తెలు సావిత్రి, తిరుమల, కు మారుడు సంతోష్ ఉన్నారు. సీతంపేటకు పనిమీద వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులంతా ఏరియా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసే లా రోదించారు. స్థానిక ఎస్సై వై.అమ్మన్నరావు ఘ టనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే కళావతి
ఎంపీటీసీ సరోజిని భర్త తవిటినాయుడు మరణవార్త విన్న మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి హుటాహుటిన సీతంపేట ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. మంచికి మారుపేరు అయిన తవిటిరాజును మరువలేమన్నారు. రోదిస్తున్న ఎంపీటీసీ సరోజినిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తాను మీకుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎంపీపీ బి.ఆదినారాయణ, ఎస్టీసెల్ నియోజకవర్గ కన్వీనర్ నిమ్మక కాంతారావు, జెడ్‌పీ కోఆప్షన్ సభ్యురాలు ఎస్.లక్ష్మి, సర్పంచ్‌లు బి.తిరుపతిరావు, ఎస్.సుశీల, ఎంపీటీసీలు ఎస్.చంద్రశేఖర్, ఎస్.మంగయ్య, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం
బొబ్బిలి: పట్టణసమీపంలోని గ్రోత్ సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు లారీకింద పడి బలిజిపేట మండలం అరసాడ గ్రామానికి చెందిన వంగపండు సత్యనారాయణ(35) గురువారం దుర్మరణం చెందాడు. జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ బుధవారం రాత్రి విధులు ముగించుకుని మోటార్ సైకిల్‌పై బొబ్బిలి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో వెనుక టైరుకింద పడగా కుడికాలి సగానికి తెగిపడింది. స్థానికులు 108 వాహనంలో స్థానిక సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సత్యనారాయణ భార్య గతేడాదే అకాలమరణం చెందగా ప్రస్తుతం పదేళ్ల వయస్సున్న వారి పాప అనాథగా మిగిలింది.
కారు ఢీకొని వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతి
కారు ఢీకొని వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతి
కారు ఢీకొని వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతి