
భగ్గుమన్న విద్యార్థి లోకం
కూటమి ప్రభుత్వ తీరుపై...
●విద్యార్థులకు తీవ్ర అన్యాయం
కూటమి ప్రభుత్వం అధికా రం చేపట్టకముందు ఎనలే ని హామీలిచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని మరచి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా కాలక్షే పం చేస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో వసతిగృహాల్లో ఏఎన్‌ఎంలు లేకపోవడం సిగ్గుచేటు. సమస్యలు పరిష్కరించక పోతే రానున్న రోజుల్లో భారీ ఉద్యమం చేపడతాం.
– పి.రామ్మోహన్, ఎస్‌ఎఫ్‌ఐ, రాష్ట్ర అధ్యక్షుడు
●విద్యారంగ సమస్యలపై
దృష్టి సారించాలి
ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై దృష్టి సారించాలి. చాలీచాలని మెస్‌చార్జీలతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో కొన్ని కళాశాలలకు సొంత భవ నాలు లేవు. ఉదయం సమయాల్లో ఇంటర్, మధ్యాహ్న వేళల్లో డిగ్రీ కోర్సులు బోధిస్తున్నా రు. సంక్షేమ వసతిగృహాల్లో ఏఎన్‌ఎంలు లేక అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొంది ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలి.
– కె.రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి,
పార్వతీపురం
●కళాశాలల్లో మెరుగైన
వసతులు కల్పించాలి
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి. రుచికరమైన భోజ నం వడ్డించేలా చర్యలు తీసుకోవాలి. అర్హత కలిగి న ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాలి.
– అంజలి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురం
● విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
● పాఠశాలల విలీనం ప్రక్రియను తక్షణమే
నిలిపివేయాలని డిమాండ్
● జిల్లాలో మూడు పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలి
● ఇంజినీరింగ్ కళాశాల పనులు
పూర్తి చేయాలి
● ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన
పార్వతీపురం టౌన్:
కూటమి ప్రభుత్వం చేపట్టిన విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థులు భగ్గుమన్నారు. కలెక్టరేట్ ను సోమవారం ముట్టడించారు. నిరసన గళం వినిపించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు నిసరన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ మండిపడ్డారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, మెస్ చార్జీలు పెంచాలని, వసతిగృహాల్లో సదుపాయాలు కల్పించాలని, డిగ్రీ ప్రవేశాలను తక్షణమే ప్రారంభించాలని, పాఠశాలల విలీనం ప్రక్రియను రద్దుచేయాలని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమపాఠశాలాల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఏడాది గడిచినా నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల వారికి అన్యాయం చేస్తోందన్నారు. అనంతరం తమ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ ఎస్.ఎస్.శోభికకు అందజేశారు.
పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలి
గిరిజన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాలో పీజీ సెంటర్ లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులను పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. కురుపాం నియోజకవర్గంలో గత ప్రభుత్వ తలపెట్టిన ఇంజినీరింగ్ కళాశాల పనులు పూర్తిచేసి ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. జిల్లా లో మెడికల్ కళాశాల, యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంత విద్యార్థుల రాకపోకలకు అనువుగా బస్సు సదుపాయం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టి.అఖిల్, జిల్లా కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షుడు కె.డేవిడ్, నాయకులు రాజశేఖర్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భగ్గుమన్న విద్యార్థి లోకం

భగ్గుమన్న విద్యార్థి లోకం

భగ్గుమన్న విద్యార్థి లోకం

భగ్గుమన్న విద్యార్థి లోకం