
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖ జిల్లా సబ్బవరంలో జరిగిన అంతర్ రాష్ట్ర కరాటే చాంపియన్ షిప్–2025 పోటీల్లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులకు పతకాలు లభించాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి ఒకప్రకటలో తెలిపారు. కరాటేలోని కాటా, కుమిటీ కేటగిరిలో పి.హేమంత్ రెండు బంగారు పతకాలు, ఎల్.జశ్వంత్, కె.శివగణేష్, పి.వెంకటరమణ, కె.ప్రేమేష్, ఎస్.జనని, జి.వివేక్ వర్మ ఒక్కో బంగారు పతకం సాధించారని పేర్కొన్నారు. కోచ్ సంతోష్, విజేతలను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.