
రైలు కింద పడి ఒకరి మృతి
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మరడాం వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వృద్ధుడు దాసరి తవిటయ్య(70) మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రానికి చెందిన తవిటయ్య ఎందుకు ఇక్కడికి వచ్చాడో ఎక్కడికి వెళ్లడానికి పట్టాలు దాటుతున్నాడో తెలియాల్సి ఉందన్నారు. ఈ సంఘటనపై పాచిపెంట గ్రామస్తులకు సమాచారం అందించి మృతదేహన్ని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
సాలూరు రూరల్: మండలంలోని ె లిపర్తి సమీపంలో బైపాస్ రోడ్డు పై ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాలూరు పట్టణంలోని గొర్లెవీధికి చెందిన గొర్లె ధర్మారావు(38)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆదివారం ఉదయం అక్కడికక్కడే మృతిచెందాడు. పొలం పనులకోసం కుమారుడితో కలిసి స్కూటీపై వెళ్తున్న ఆయన ప్రమాదంలో మృతిచెందగా కుమారుడికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
వృద్ధుడి మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రూ పార్క్ వద్ద 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు ఆదివారం గుర్తించారు. తెల్లటి చొకా, తెల్లని గెడ్డం, దుప్పటి, స్టీల్ ప్లేట్ మృతదేహం వద్ద ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిలా ఉన్నాడని, మృతదేహాన్ని గుర్తించిన వారు ఫోన్ 9154874474, టూటౌన్ సీఐ 9121109420 నంబర్లకు ఫోన్ చేయాలని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
కంటకాపల్లి రైల్వేస్టేషన్ వద్ద మహిళ మృతదేహం
విజయనగరం క్రైమ్/జామి: జిల్లాలోని కంటకాపల్లి రైల్వేస్టేషన్‌వద్ద ఓ మహిళ మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది ఆదివారం కనుగొన్నారు. కంటకాపల్లి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య మెయిన్ డౌన్‌లైన్ ట్రాక్ మధ్య పడి ఉన్న మహిళ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటుందని ఐదడుగుల ఐదంగుళాల పొడవు, ఎరుపు రంగు ఛాయతో, పసుపు, గ్రీన్, గోధుం రంగు గల నైటీ ధరించి ఉందని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 919490617089, 919182073593, 08912883218 నంబర్లకు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ హెచ్‌సీ రవికుమార్ కోరారు.

రైలు కింద పడి ఒకరి మృతి

రైలు కింద పడి ఒకరి మృతి