
ఇంకెన్నాళ్లీ రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన?
వీరఘట్టం: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనతో కూటమి ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ధ్వజమెత్తారు. వీరఘట్టం మండలం వండువ గ్రా మంలో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు. నేడు రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయన్నారు. మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయపెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతన్నల కోసం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడంతో ఇప్పుడు ప్రీమియం భారం రైతులపై పడిందన్నారు. విత్తనాలు, ఎరువులు దొరకక రైతన్నలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం విచారకరమన్నారు. వ్యవస్థలను నాశనం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. నాడు–నేడుతో సర్కారు బడు లకు కార్పొరేట్ హంగులు కల్పించి పేద, మధ్య తరగతి విద్యార్థులకు జగనన్న బైజూస్ పాఠాలు అందుబాటులోకి తెస్తే.. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థ సర్వనాశనం చేసి పేదలకు ప్రభుత్వ విద్య ను దూరం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులువె మన్మథరావు, ఉమామహేశ్వరరావు, ఎం.లక్ష్మి, బుజ్జి పాల్గొన్నారు.
● కూటమి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తిన అరకు ఎంపీ తనూజారాణి