
పెట్టిందే తిను
● గిరిజన హాస్టల్స్‌లో అమలు కాని మెను
● భోజనంలో నాణ్యత అంతంతే
● ఆశ్రమ పాఠశాలలపై అంతులేని నిర్లక్ష్యం
రామభద్రపురం: ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన మెనూ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పాలకులతో పాటు ప్రభుత్వ అధికారులు ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. కానీ వసతి గృహాల్లో మెనూ ప్రకారం మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.పేద కుటుంబాలకు చెందిన గిరిజన విద్యార్థులే కదా ఫర్వాలేదు. ఏది వండేసి పెట్టిన తినేస్తారులో అని పాలకులతో పాటు అధికారులూ భావిస్తున్నారు. వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులంటే నిర్లక్ష్యం చూపుతున్నారు. అందుకు నిదర్శనం రామభద్రపురం మండలంలోని నేరెళ్లవలస ప్రభుత్వం గిరిజన సంక్షేమ వసతి గృహంలో ప్రభుత్వం అందించిన మెనూ చార్ట్ ప్రకారం విద్యార్థులకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందడం లేదు.అధికారుల పర్యవేక్షణ లేక ఆహారంలో నాణ్యత కరువవుతోందని తల్లిందడ్రులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ఆశ్రమ పాఠశాలల అండ్ ప్రీ మెట్రిక్ హాస్టల్ వారి ఆహార పట్టిక ప్రకారం ఆదివారం ఉదయం గోధుమపూరీ, బంగాళాదుంప బఠాణీకుర్మా, ఉడకబెట్టిన గుడ్డు పెట్టాలి. అలాగే ఉదయం అల్పాహారంగా వేరుశనగ చిక్కి ఇవ్వాల్సి ఉంది.మధ్యాహ్నం నాణ్యమైన చికెన్ బిర్యానీ,పెరుగు చెట్నీ, గోంగూర చెట్నీతో భోజనం వడ్డించాలి. అక్కడి నిర్వాహకులు ఇవేవీ పెట్టకుండా మెనూ చార్ట్‌ను పక్కన పడేసి వాటికి బదులుగా ఉదయం గంజి అన్నం, మధ్యాహ్నం తెల్ల అన్నం, రసం, వండిన గుడ్డు పెట్టేసి సరిపెట్టారు.
నాణ్యత అంతంతే..
వసతి గృహంలో విద్యార్థులకు పెట్టిన భోజనంలో నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. మెత్తగా ముద్ద అన్నం, పలుచటి చారుతో వడ్డిస్తూ ఆదా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి భోజనంతో పాటు పండ్లు ఇవ్వాలి కానీ పం

పెట్టిందే తిను