
ఇసుక అక్రమంగా తరలిస్తే ఊరుకోం
ఇసుక అక్రమ తరలింపును రేగిడి మండలంలోని కొమెర గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. లారీలకు అడ్డంగా నిలబడి ఆందోళన చేశారు. గదబపేట వద్ద నాగావళి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వేసి ఒక్కోలారీలో 50 టన్నులు తరలించడంతో బ్రిడ్జిలు కూలిపోతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ఖండ్యా బ్రిడ్జి కూలిపోయిందని, కొమెర నుంచి లక్ష్మీపురం, అప్పాపురం, మజ్జిరాయుడుపేట వరకు ఉన్న మరో ఐదు బ్రిడ్జిలు కూడా కూలిపోయే దశలో ఉన్నాయన్నారు. ఇసుకను గ్రామాల మీదుగా తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. సమస్యను కలెక్టర్ అంబేడ్కర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. – రేగిడి