● ఇదిగో.. అదిగో అంటూనే కాలయాపన ● కౌన్సెలింగ్‌ పూర్తయినా నేటికీ సచివాలయ ఏఎన్‌ఎంలకు అందని ఉత్తర్వులు ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు ● జీతాల కోసం ఎదురుచూస్తున్న ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

● ఇదిగో.. అదిగో అంటూనే కాలయాపన ● కౌన్సెలింగ్‌ పూర్తయినా నేటికీ సచివాలయ ఏఎన్‌ఎంలకు అందని ఉత్తర్వులు ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు ● జీతాల కోసం ఎదురుచూస్తున్న ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు

Jul 12 2025 9:53 AM | Updated on Jul 12 2025 9:55 AM

సాక్షి, పార్వతీపురం మన్యం:

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇటీవల చేపట్టిన బది లీలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అస్తవ్యస్త విధా నాలు, సిఫారసు లేఖలు, డబ్బు ప్రభావంతో ఈ ప్రక్రియ వివాదంగా మారిన విషయం విదితమే. కొన్ని శాఖల్లో ఉద్యోగులు నేటికీ గాలిలో ఉండిపో యి, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఏఎన్‌ఎంలపై ఎందుకంత నిర్లక్ష్యం?

పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న సచివా లయ ఏఎన్‌ఎంల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన వీరికి బదిలీ ల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొత్తం 778 సచివాలయాలు ఉండగా.. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టా రు. స్థాన చలనం కలిగిన వారికి తొలుత ఈ నెల ఐదో తేదీన ఉత్తర్వులు ఇస్తామన్నారు. అదే రోజున డీఎంహెచ్‌వో కార్యాలయంలో అడిగితే.. ఐదో తేదీ నుంచి పదో తేదీలోపు ఎప్పుడైనా కొత్త స్థానంలో చేరవచ్చని ఉత్తర్వులు ఇవ్వకుండానే తిప్పి పంపా రు. విజయనగరం వెళ్లి తీసుకోవాలని మరోసారి చెప్పి పంపారు. అక్కడికి వెళ్లి.. అడిగితే, ‘అందరిదీ పార్వతీపురం మన్యం జిల్లా కదా.. అక్కడికే వెళ్లండం’టూ వెనక్కి పంపేశారు. మరలా పదో తేదీన ఇక్కడి కార్యాలయంలో అడిగితే.. మెగా పేరెంట్స్‌ డే ఉందని చెప్పి 11వ తేదీన రమ్మన్నారు. చేసేదిలేక సచివాలయ ఏఎన్‌ఎంలు శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్లారు. ఈసారి కూడా సోమ, మంగళవారాల్లో ఏదో ఒక రోజు అంటూ దాట వేశా రు. గట్టిగా అడిగితే.. అధికారులు సైతం అదే స్థా యిలో బదులిచ్చారు. ఇన్నిరోజులు గాలిలో ఉండిపోయామని.. ఇప్పటికీ ఫలానా తేదీ అంటూ కచ్చితంగా చెప్పడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లాలో బదిలీ అయిన ఏఎన్‌ఎంలంతా తొమ్మిదో తేదీనే విధుల్లో చేరిపోయారని చెబుతున్నారు. సేవాదృక్పథంతో విధులు నిర్వర్తిస్తున్న తమపై ఎందుకంత చులకన ని వాపోతున్నారు. ‘ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అడిగినా మూవ్‌మెంట్‌ ఇవ్వడం లేదు. విజయనగరం వెళ్లి అడగాలన్నారు. అక్కడికి వెళ్తే మన్యం అంటున్నారు. మా బాధను అర్థం చేసుకోవాలి. కౌన్సెలింగ్‌ అయినప్పుడు ఏ స్థానంలో నియమించారో తక్షణమే అక్కడికే పంపిస్తూ ఉత్త ర్వులు జారీ చేయాల’ని వారంతా కోరుతున్నారు.

బదిలీ శాపం.. ఎంటీఎస్‌లకు అందని జీతం

1998 డీఎస్సీ ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్‌ ఉపాధ్యా యులకు ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ‘సర్దుబాటు’ చేసిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లా లో మొత్తం 475 మందిని సర్దుబాటు చేశారు. ఇందులో 2008 డీఎస్సీ బ్యాచ్‌ వారు 99 మంది, మిగిలిన 376 మంది 1998 డీఎస్సీకి చెందిన ఎంటీఎస్‌లు ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలు, జెడ్పీ యాజమాన్యంలో క్లస్టర్‌ పాఠశాలలకు వీరిని సర్దుబాటు చేశారు. వయస్సు, ఆరోగ్య సమస్యల రీత్యా 1998 డీఎస్సీ ఎంటీఎస్‌లు దీనిపై పెదవి విరిచినా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. ఏ రోజు ఎక్కడ పనిచేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. మరో దారిలేక.. విధుల్లో చేరినా.. బదిలీల్లో అస్తవ్యస్త విధానాల వల్ల వీరికి జీతాలు అందని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. వీరికి సంబంధించి క్లస్టర్‌ హెచ్‌ఎంలకు డ్రాయింగ్‌ అధికారులు ఇచ్చా రు. ఇదే సమయంలో ఎంటీఎస్‌లకు జీతాలు ఎలా పెట్టాలో స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. దీంతో వారెవరికీ జూన్‌నెల జీతాలు పడలేదు. జులై నెలకు సంబంధించి బిల్లు పెట్టే సమయం సమీపిస్తున్నా.. ఇప్పటికీ ఎటువంటి ఆదేశాలూ రాలేదు. దీంతో ఈ నెల కూడా జీతాలు అందుతాయా, లేదా అన్న సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

● ఇదిగో.. అదిగో అంటూనే కాలయాపన ● కౌన్సెలింగ్‌ పూర్తయినా1
1/1

● ఇదిగో.. అదిగో అంటూనే కాలయాపన ● కౌన్సెలింగ్‌ పూర్తయినా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement