
ఎరువులేవీ..?
కొమరాడ: ఎరువులు సరిగా అందడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదంటూ పలువురు సభ్యులు అధికారులను ప్రశ్నించారు. కొమరాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శెట్టి శ్యామల, ఎంపీడీఓ ఎస్.రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొడుము సర్పంచ్ యేగిరెడ్డి సింహాచలం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ రైతులకు ఎరువుకష్టాలు తీర్చాలని కోరారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య ఉండేదికాదన్నారు. వైస్ ఎంపీపీ నంగిరెడ్డి శరత్‌బాబు మాట్లాడుతూ జంఝావతి ఎత్తి పోతల పథకం తరచూ మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకోకపోవడంతో ఆయకట్టుకు సకాలంలో సాగునీరు అందడంలేదన్నారు. సీపీఎం నాయకుడు కొల్లు సాంభమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుంచి కొమరాడకు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలన్నారు. పూర్ణపాడు – లాబేస్ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్డార్ సీహెచ్.సత్యానారాయణ, వ్యవసాయ శాఖ అధి కారి ప్రసాదరావు, జెడ్పీటీసీ సభ్యురాలు ద్వారపురెడ్డి లక్ష్మి, తహసీల్డార్ సీహెచ్ సత్యనారాయణ, ఎంపీడీఓ రమేష్, వైస్ ఎంపీపీ నంగిరెడ్డి శరత్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.