
పురుగుల బియ్యం సరఫరాపై దర్యాప్తు
–8లో
గుంటూరు, రాయగడ
ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు
గుంటూరు, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది.
వీరఘట్టం: పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం కోసం పురుగుల బియ్యం సరఫరాపై పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కు హాజరైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ‘పండగ పూట పురుగుల బియ్యమేనా’ అనే శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన వార్తకు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కె.శ్రీనివాసరావు స్పందించారు. వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. వంట ఏజెన్సీ నిర్వాహకురాలితో మాట్లాడారు. బియ్యంలో సుంకి, తెల్ల పురుగు లు ఉన్నాయని, ప్రతిరోజు ఆ బియ్యంను శుభ్రం చేసి వేడి నీటితో కడిగి వంటచేస్తున్నామని వంట ఏజెన్సీ నిర్వాహకురాలు డీఎమ్‌కు తెలిపారు. ఈ సందర్భంగా డీఎమ్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో పాఠశాలకు ఇచ్చిన రేషన్ బియ్యం ( 50 కిలోల బస్తాలు) ప్రతీ పాఠశాలలో 1 నుంచి 2 టన్నుల వరకు ఉన్నాయన్నారు. పాత బియ్యంకు ఇప్పటికే పరుగులు పట్టి ఉన్నాయని, పాత బియ్యం ఉన్న గదిలోనే కొత్తగా ఇచ్చిన సన్నబియ్యం వేయడంతో ఆ పరుగులు వీటికి పడుతున్నాయన్నారు. కొత్తగా పాఠశాలలకు వచ్చే బియ్యంను వేరే గదిలో భద్రపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ల్లో ఉన్న పాత స్టాకును త్వరలో గోదాములకు తరలిస్తామన్నారు.

పురుగుల బియ్యం సరఫరాపై దర్యాప్తు