
తోటపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.5.17లక్షలు
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు భక్తులు హుండీలలో వేసి న కానుకల రూపంలో రూ.5,17,488లు నగ దు వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ తెలిపారు. కోదండరామాలయంలోని హుండీల నుంచి రూ.7,277 లు వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు సాలూ రు గ్రూపు ఆలయాల ఈఓ టి.రమేష్ సమక్షంలో సాగిందన్నారు. లెక్కింపు ప్రక్రియలో ఆల య అర్చకులు వి.వి.అప్పలాచార్యులుతో పాటు సిబ్బంది ఎం.మురళీమోహన్, ఎం.బలరాంనాయుడు, శ్రీధర్, గ్రామపెద్దలు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
నందివానివలస
పరిసరాల్లో ఏనుగులు
గరుగుబిల్లి: గజరాజుల గుంపు బలిజిపేట మండలం పెద్దింపేట నుంచి గురువారం రాత్రి గరుగుబిల్లి మండలంలోని శివ్వాం, సీమలవానివలస, సంతోషపురం, తోటపల్లి మీదుగా నందివానివలస చేరుకొన్నాయి. గత ఇరవై రోజులుగా సీతానగరం, బలిజిపేట మండలా ల్లో సంచరించిన ఏనుగులు మళ్లీ గరుగుబిల్లి మండలం చేరుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పారిశుద్ధ్య పక్షోత్సవాలపై అవగాహన
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్న ప్రత్యేక పారిశుద్ధ్య పక్షోత్సవాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వచ్ఛమైన తాగునీరు, అనీమియా కమిటీల నిర్వహణ చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలు, పీఎం సూర్యఘర్, వెక్టర్ హైజీన్‌యాప్ తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహించాలని ఆదేశించారు. మలేరియా దోమల నివారణ మందును పిచికారీ చేయాలన్నారు. జిల్లాలో వెయ్యి పీఎం సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటుకావాల్సి ఉందన్నారు. సమావేశంలో డీపీఓ టి.కొండలరావు, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీరు ఒ.ప్రభాకరరావు, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.మల్లికార్జున, డీఎల్‌డీఓ రమేష్ రామన్, తదితరులు పాల్గొన్నారు.

తోటపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.5.17లక్షలు

తోటపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.5.17లక్షలు