
అన్నీ అడ్డంకులే..
ఈ ఏడాది వ్యవసాయానికి అన్నీ అడ్డంకులే. ఓ వైపు వాతావరణం సహకరించడం లేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సాయమూ దక్కలేదు. నాకున్న భూమితో పాటు, మరికొంత కౌలుకు తీసుకుని సేద్యానికి సిద్ధమయ్యాను. నారుమడి సిద్ధంచేసి ఉడుపులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నా. ఎరువులు లేవు. ప్రస్తుతం రైతులకు అవసరమైన యూరియా కూడా దొరకడం లేదు. దీంతో సమీప జిల్లాకు, మండలాలకు వెళ్లి బస్తాపై రూ.100 మేర అదనంగా చెల్లించి తీసుకుంటున్నాం. ఇతర ప్రాంతాల నుంచి రావాలంటే రవాణా ఖర్చులు మరింత అవుతున్నాయి.
– కరణం భాస్కరరావు, రైతు, లుంబూరు గ్రామం, పాలకొండ మండలం
●