
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
● కుమారుడికి తీవ్ర గాయాలు
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని బీజేపురం గ్రామానికి చెందిన కరకవలస రమణమూర్తి (57) ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ కొంతకాలంగా పార్వతీపురంలో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం కుమారుడు దేవీ సంతోష్‌కుమార్‌తో కలిసి విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న కుమార్తె గాయత్రి ఇంటికి వెళ్తేందుకు ఏపీ 35కేజీ 9236 నంబర్ గల కారులో బయలుదేరారు. సరిగ్గా ఆనందపురం బ్రిడ్జి సమీపంలోకి వచ్చే సరికి ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రమణమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు సంతోష్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని విశాఖపట్నం ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం సీఐ చింత వాసునాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి