సాలూరులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం రేపు | - | Sakshi
Sakshi News home page

సాలూరులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం రేపు

Jul 6 2025 7:08 AM | Updated on Jul 6 2025 7:08 AM

సాలూరులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం రేపు

సాలూరులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం రేపు

సాలూరు: సాలూరు పట్టణం మెంటాడ వీధి కోదండరామ కల్యాణ మండపంలో సోమ వారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం జరగనుందని, పార్టీ శ్రేణులంతా తరలిరావాలని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించే సమావేశానికి శాసనమండలి విక్షనేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్‌ పరిశీలకులు బి.ప్రసాద్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తదితర పెద్దలు పాల్గొంటారన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు, వివిద విభాగాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరుకావాలని కోరారు.

మలేరియా నియంత్రణకు పటిష్ట చర్యలు

పార్వతీపురంటౌన్‌: జిల్లాలో మలేరియా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. కొత్తవలస చెరువులో శనివారం గంబూషియా చేపలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో ముందుగా గుర్తించిన 178 చెరువుల్లో గంబూషియా చేపలు విడుదలచేశామన్నారు. ఇవి చెరువులో ఉన్న దోమల లార్వాలను తినేయడం వల్ల మలేరియా, డెంగీకారక దోమల వ్యాప్తి తగ్గుతుందన్నారు. 915 గ్రామాల్లో ఐఆర్‌ఎస్‌ మొదటి దశ స్ప్రేయింగ్‌ పూర్తి చేశామని, ప్రస్తుతం రెండో విడత జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ–ఆర్డీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు, ఏఎంఓ సూర్యనారాయణ, కన్సల్టెంట్‌ రామచంద్ర, సూపర్‌వైజర్‌ జయగౌడ్‌, వైద్య సిబ్బంది సుజాత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

10న మెగా పేరెంట్స్‌

టీచర్స్‌ సమావేశం

పార్వతీపురంటౌన్‌: జిల్లాలో అన్ని పాఠశాలల్లోనూ మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ సమావేశాలను ఈనెల 10న నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతి నిధులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, పూర్వవిద్యార్థులతో కలిసి సమావేశాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు నిర్వహించాలని కోరారు. తల్లిదండ్రులకు క్రీడల నిర్వహణతో పాటు భోజన సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్‌.ఎస్‌.శోభిక, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు అశుతోష్‌ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు, డీఆర్వో కె.హేమలత, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.ధర్మచంద్రా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

డిపాజిట్ల స్వాహాపై విచారణ

● గైర్హాజరైన గెడ్డలుప్పి పోస్టాఫీస్‌ బీపీఎం బొమ్మిరాణి

సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి పోస్టాఫీస్‌లో కొత్తవలస, గెడ్డలుప్పి గ్రామస్తులు వివిధ రూపాల్లో దాచుకున్న డబ్బులు స్వాహా చేశారన్న ఫిర్యాదు మేరకు పోస్టల్‌ అధికారులు శ్రీనివాసరావు, గుల్ల అచ్చుతరావు శనివారం విచారణ జరిపారు. పోస్టాఫీస్‌ రికార్డులను పరిశీలించారు. మెచ్యూరిటీ అయిన వివిధ రకాల బాండ్‌లు, ఆర్డీల వివరాలపై ఆరా తీశారు. పోస్టల్‌ ఖాతాదారులతో మాట్లాడారు. బాండ్లు మెచ్యూరిటీ అయినా డబ్బులు ఇవ్వడంలేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. విచారణకు వస్తామని అధికారులు సమాచారం ఇచ్చినా బీపీఎం బొమ్మిరాణి గైర్జాజరుకావడంపై ఖాతా దారులు మండిపడ్డారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, రికార్డులు పరిశీలించిన అనంతరం పోస్టల్‌ ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి ఖాతాదారులకు న్యాయం చేస్తామని విచారణ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అల్లుతిరుపతిరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement