
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
చదువుకోవాలన్న ఆ గిరిజన చిన్నారుల ఆశలను గెడ్డ నీళ్లు అడ్డుతున్నాయి. పార్వతీపురం మండలంలోని నరసయ్య పేట గ్రామం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు గెడ్డల్లో తక్కువగా నీరు పారే సమయంలోనే హాజరయ్యే దుస్థితి గిరిజన విద్యార్థులది. రోజూ తమ చిన్నారులను పాఠశాలకు అప్పగించేందుకు పనులు మానుకుని సమయాన్ని కేటాయిస్తున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. అలాగే మండలంలోని ఎన్.ములగ గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వెళ్లాలంటే దాదాపు ఐదు గ్రామాలకు చెందిన విద్యార్థులు వరదనీటిలో బురదలో నడుచుకుంటూ పాఠశాలకు చేరాల్సిందే. సమీపంలో ఉన్న వ్యవసా య కాలువ నుంచి ములగ గ్రామం వైపు నీరు పారడంతో ఆ దారి నిత్యం జలమయమై బురదతో నరకంలా తయారవుతుంది. ఈ దారిలోనే విద్యార్థులు, చుట్టుపక్కల గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటా రు. క్రమంగా వర్షాలు కురిస్తే రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
–పార్వతీపురం రూరల్/కొమరాడ
చదువులకు
అడ్డుగా గెడ్డ..!
న్యూస్‌రీల్

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025