
గర్భిణికి స్కానింగ్ కష్టాలు
17న అండర్ –16 క్రికెట్ జట్టు ఎంపికలు
విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న అండర్ – 16 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం శివారు విజ్జి క్రికెట్ మైదానంలో మంగళవారం జరిగే ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2009 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. అలాగే పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్ కార్డ్, జనన ధ్రువీవరణ పత్రం, మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకు రావాలన్నారు. ఉదయం 7.30 గంటలకు నిర్వహించే ఎంపిక పోటీలకు క్రీడాకారులు వైట్ డ్రెస్, సొంత కిట్టుతో హాజరు కావాలని ఆయన సూచించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు జిల్లా స్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న అండర్–15 బాల, బాలికల చెస్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 15న ఆదివారం నిర్వహించనున్నట్టు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కెవి.జ్వాలాముఖి శనివారం తెలిపారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనపగరం, ఫైర్ చెస్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎంపిక పోటీల్లో 2010 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది బాల, బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని, వివరాలకు 97033 44488 నంబరును సంప్రదించాలని సూచించారు.