అసంతృప్తుల నోరు నొక్కేశారు! | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తుల నోరు నొక్కేశారు!

Jun 10 2025 7:14 AM | Updated on Jun 10 2025 7:14 AM

అసంతృప్తుల నోరు నొక్కేశారు!

అసంతృప్తుల నోరు నొక్కేశారు!

వాస్తవానికి చినబొండపల్లి వద్ద జరిగిన పార్టీ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఒక విధంగా నియోజకవర్గంలో ఉన్న విభేదాలు, ఎమ్మెల్యే తీరుపై అంతా ఏకరవు పెడతారని అంతా అనుకున్నారు. ఉదయం నుంచే చాలా మంది కార్యకర్తలకు బెదిరింపులు వెళ్లాయ ని.. ఎవరు మాట్లాడినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది.

●మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌ కూడా ఉదయం జరిగి న కార్యక్రమానికే అలా వచ్చి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకు ఆయనను కూడా పోలీసులు అనుమతించలేదని తెలిసింది. చాలా రోజులుగా ఆయనను స్థానిక ఎమ్మెల్యే దూరం పెట్టిన విషయం విదితమే. ●చినబొండపల్లి వద్ద జరిగిన పార్టీ కార్యక్రమానికి ముందుగా అనుమతి ఉన్న వారినే లోపలికి వదిలారు. దీంతో ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు.. స్థానికంగా ఉన్న కొంతమంది పార్టీ నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

●పార్వతీపురం మండలం నర్సిపురం జనసేన వీర మహిళలు.. సమావేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరిగారు.

●పాలకొండ నియోజకవర్గం నుంచి కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి లోపలికి వెళ్లలేక బయ టే ఉండిపోయారు.

●కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి నుంచి కొంతమంది సీనియర్‌ నాయకులు అక్కడకు వచ్చారు. తమను లోపలికి వదలకపోవడంపై పోలీసులతో వాదనకు దిగారు. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి లోపలికి వదిలి.. తమను పంపకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement