నిధులు లేక నిలిచిన పల్లె ప్రగతి!
● మంజూరుకాని 15వ ఆర్థిక సంఘ రెండో విడత నిధులు ● రావాల్సిన నిధులు రూ.33 కోట్లు ● పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణకూ నిధులులేని వైనం
●త్వరలో విడుదల కానున్నాయి
15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో విడుదల కానున్నాయి. విడుదలైన వెంటనే పంచాయతీల ఖాతాలకు జమచేస్తాం. పారిశుద్ధ్య పనులు చేయా లని ఈఓపీర్డీలకు, కార్యదర్శులకు సూచించాం. మంచినీటి ట్యాంకులు ఎప్పటికప్పుడు శుద్ధిచేసేలా చర్యలు తీసుకుంటాం.
– మోహనరావు, డీఎల్‌పీఓ
రామభద్రపురం: పల్లె ప్రగతికి నిధుల లేమి వెంటాడుతోంది. కనీసం పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణకూ నిధులు లేని పరిస్థితి. జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. వివిధ అభివృద్ధి పనులకు ఆధారమైన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు సుమారు రూ.33 కోట్లు విడుదల కాలేదు. దీంతో పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువల పనులు జరగడం లేదు. వీధులు సరైన రహదారులు లేక మట్టిరోడ్లపైనే గ్రామీణ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కేవలం ఇంటి పన్నులు సిబ్బంది జీతాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల నిర్వహణకే సరిపోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడంలేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం..
పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో వీధుల్లోని డ్రైనేజీలు శిథిలమైనా మరమ్మతులు చేయలేకపోతున్నారు. కొత్తగా కాలువల నిర్మాణాలు జరగడం లేదు. వాడుక నీరు వీధుల్లోనే ప్రవహిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మురుగునీరు నిల్వ ఉండి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. వీధి దీపాల నిర్వహణపై నిధుల కొరత ప్రభావం పడుతోంది. చాలా పల్లెలు చీకటిలోనే కాలం వెల్లదీస్తున్నాయి.
నిధులు లేక నిలిచిన పల్లె ప్రగతి!
నిధులు లేక నిలిచిన పల్లె ప్రగతి!


