మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
● రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం
● ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
● మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య
దత్తిరాజేరు: తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మార్పిన అప్పలనాయుడు, వంగర రామకృష్ణ, మరడ రాము మృతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆరోపించారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. ప్రమాద విషయాన్ని వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలను మరింత ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఎలాంటి మగదిక్కు లేని వంగర రామకృష్ణ కుమార్తెకు ప్రైవేట్ ఉద్యోగం వేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.రెండవ కుమార్తె చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వేయిస్తామన్నారు. మరడ రాము కుమారుడు చదువుతున్నందున జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకోనున్నట్లు తెలిపారు. గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రెడ్డి సింహాచలంతో కలసి బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్, మాజీ జెడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, పార్టీ నాయకులు ఫణీంద్రుడు, దత్తి చిరంజీవి ఉన్నారు.
మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ


