ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా రాజు | - | Sakshi
Sakshi News home page

ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా రాజు

Dec 22 2025 2:18 AM | Updated on Dec 22 2025 2:18 AM

ఖోఖో

ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా రాజు

గంట్యాడ: ఈనెల 23వతేదీ నుంచి 28వతేదీ వరకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్పూర్‌లో జరగనున్న 69వ నేషనల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలురు జట్టుకు మేనేజర్‌గా పీవీఎస్‌ఎన్‌ రాజు వ్యవహరించనున్నారు. ఆయన గంట్యాడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

కొటియాలో ఒడిశా మంత్రి పర్యటన

సాలూరు: వివాదాస్పద ఆంధ్రా ఒడిశా సరిహద్దు కొటియా గ్రామంలో ఒడిశా రాష్ట్ర ఆహారసరఫరా మంత్రి కృష్ణ చంద్ర పాత్ర ఆదివారం పర్యటించారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు ఆయన అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొటియా గ్రామాలకు బియ్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి కార్డుకు 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బొలెరో ఢీకొని యువకుడి మృతి

రేగిడి: మండల పరిధిలోని చిన్నశిర్లాం జంక్షన్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామానికి చెందిన బొడ్డు భానుప్రకాష్‌ (22) ద్విచక్రవాహనంపై పాలకొండ నుంచి రాజాం వెళ్తుండగా రాజాం నుంచి పాలకొండ వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే యువకుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామానికి సమీపంలో గల గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వస్తూ డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు గ్రామ వీఆర్‌ఓ త్రినాథరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలంలోని మెంటాడ గ్రామానికి చెందిన బండారు స్వామినాయుడు(35) మూడు రోజుల క్రితం అరకులో ఉన్న తన స్నేహితుడికి ద్విచక్ర వాహనంపై ఇచ్చేందుకు వెళ్తూ డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థికసాయం

డెంకాడ: బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న బీహెచ్‌ లాస్య వైద్య ఖర్చుల కోసం విజయనగరం జాయింట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ వారు రూ.10 వేల ఆర్థికసాయం చేసినట్లు ఫౌండేషన్‌ ప్రతినిధి ఆదినారాయణ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. దాతలు మరింతమంది ముందుకువచ్చి, సాయం చేస్తే లాస్య ఆరోగ్యం మెరుపడే అవకాశం ఉందని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ఖోఖో రాష్ట్ర జట్టుకు  మేనేజర్‌గా రాజు1
1/3

ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా రాజు

ఖోఖో రాష్ట్ర జట్టుకు  మేనేజర్‌గా రాజు2
2/3

ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా రాజు

ఖోఖో రాష్ట్ర జట్టుకు  మేనేజర్‌గా రాజు3
3/3

ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement