నాణ్యమైన వస్త్రాల కలబోత ఎస్‌ఆర్ షాపింగ్ మాల్
బొబ్బిలి: దేశ, విదేశాల నుంచి నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలకు తీసుకువచ్చి బొబ్బిలి ప్రాంత ప్రజలకు అందించడమే ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ లక్ష్యమని డైరెక్టర్ ప్రసాదరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 14వ బ్రాంచ్‌ను బొబ్బిలిలో ప్రారంభిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనకు సినీనటి అనసూయ భరద్వాజ్ హాజరుకానున్నారని తెలిపారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీ నాయన, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, మున్సిపల్ చైర్మన్ ఆర్.శరత్‌బాబు, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ ఎం.డి శంబంగి వేణుగోపాల నాయుడు, టీబీఆర్ గ్రూప్స్ చైర్మన్ తూముల భాస్కరరావు హాజరు కానున్నట్లు తెలిపారు.


